English   

అందాల విందుకు రెడీ అయిన చిన్నారి పెళ్లి కూతురు

avika gor
2020-04-06 14:02:21

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అవికా గోర్, ఆ క్రేజ్ తో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైంది. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన 'ఉయ్యాలా జంపాల' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ వాలు కళ్ళ సుందరి. ఆ సినిమాలో ఆ నటనతో ఆమెకి వరస అవకాశాలు వచ్చాయి. అయితే అలా అవకాశాలు వస్తుండగానే ఎందుకో కానీ ఈ అమ్మాయి తెలుగు సినిమాలను దూరం పెట్టింది. చదువు పేరు చెప్పి సినిమాలకి దూరం అయిన ఆమె మళ్ళీ గత ఏడాది రాజు గారి గది సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె సినిమాలు ఒప్పుకునేందుకు అనేక షరతలు విధించిందని దాంతో ఆమెకు హీరోయిన్‌ ఛాన్స్‌ లు తగ్గాయని కూడా ఒక టాక్ ఉంది. అలా ఆమె స్వయంక్రుతం వలన అవికా పేరును పరిశ్రమ దాదాపుగా మర్చిపోయింది. దీంతో జరిగిన పొరపాటు గ్రహించిన అవికా తన మైండ్ సెట్ మార్చుకుని ఆలోచన సరళి మార్చుకున్నట్టు తెలిసింది. ఏకంగా ఆమె ఇప్పుడు గ్లామర్‌ పాత్రలు కూడా చేసేందుకు సిద్ధమైందని అంటున్నారు. ఆమె కొత్త ఫోటో షూట్ చూస్తే అవికా అందాల ప్రదర్శనకు సిద్ధమే అని స్పష్టమవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఒకరకంగా బాలీవుడ్‌ భామలు ఫోటో షూట్స్‌ ద్వారానే ప్రేక్షకులను, పరిశ్రమను ఆకట్టుకుంటారు. ఇదే ఫార్ములాను అవికా ఫాలో అవుతోందని అంటున్నారు. అలా చిన్నారి పెళ్లికూతురు ఇప్పుడు అందాల విందుకు కూడా రెడీ అయ్యిందన్న మాట. 
 

More Related Stories