English   

హమ్మయ్య.. కనికా కపూర్ కి కరోనా నెగిటివ్..

Singer Kanika Kapoor
2020-04-06 14:20:13

13 రోజుల్లో 6 టెస్టులు.. అందులో 4 సార్లు కరోనా పాజిటివ్.. ఓ మనిషిని అంతకంటే భయపెట్టడానికి మరొకటి ఏముంటుంది చెప్పండి..? ఇప్పుడు బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పరిస్థితి ఇలాగే ఉంది మరి. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఈమెను అస్సలు వదలడం లేదు. భారత్ లో కరోనా పాజిటివ్ అని తేలిన తొలి బాలీవుడ్ సెలబ్రిటీ కనికా కపూర్. మార్చ్ 9న లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఈమె.. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లో బస చేసింది. అక్కడే పార్టీలు కూడా చేసుకున్నారు. కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత పార్టీలకు వెళ్లడంతో ఆమెపై పోలీసులు కేసు కూడా ఫైల్ చేసారు. 

ఇదిలా ఉంటే కరోనాతో గత పది రోజులుగా ఈమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతుంది. 15 రోజుల తర్వాత ఈమె ఆరోగ్య పరిస్థితిలో కాస్త మార్పు కనిపించింది. తాజాగా మరోసారి ల్యాబ్ కు పంపిన ఆమె సాంపిల్స్ లో మరోసారి కరోనా నెగిటివ్ అని తేలింది. దాంతో కుటుంబ సభ్యులు కుదుట పడ్డారు. చివరి రెండు సార్లు కూడా ఈమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ అని రావడంతో డిశ్చార్జ్ చేశారు. ఇప్పటికే నాలుగు శాంపిళ్ళు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఐదు, ఆరోసారి కూడా కనికకు నెగిటివ్ వచ్చిందని.. దాంతో డిశ్చార్జ్ చేశామని చెప్పారు. సాధారణంగా ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి కరోనా నెగిటివ్ అని వస్తుందంటున్నారు వైద్యులు. కానీ కనికా కపూర్ విషయంలో మాత్రం 5వ సారి నెగిటివ్ వచ్చింది.

More Related Stories