English   

ఇది జోక్స్ వేసే టైం కాదు.. సాయికుమార్ సీరియస్..

Sai Kumar
2020-04-06 14:28:38

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ గుప్పిట్లో ఉంది. ఇది విలయతాండవం చేస్తుంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రజలు పరుగులు తీస్తున్నారు. మన దేశంలో కూడా ఇప్పుడు ఈ వైరస్ విజృంభిస్తుంది. దీని బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో సెలబ్రిటీలు అంతా ఒక్కొక్కరు బయటికి వచ్చి జనాన్ని చైతన్య పరుస్తున్నారు. ఈ క్రమంలోనే డైలాగ్ కింగ్ సాయికుమార్ కూడా ప్రజలను అప్రమత్తం చేశాడు. కరోనా వైరస్ అంటే కామెడీ కాదని దాంతో జోకులు వేయొద్దని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 

తాను కూడా మీలా అందరిలో ఒక్కడిని అని.. భారతీయుడిని అయినందుకు గర్వంగా ఉంది అంటూ చెప్పాడు సాయి కుమార్. ప్రధాని మోడీ గారు చెప్పినట్లు చప్పట్లు కొట్టాం.. దీపాలు వెలిగించాము.. జనతా కర్ఫ్యూ పాటించాము.. అలాగే కరోనా వైరస్ ను కూడా అంతా ఒక్కటై ఈ దేశం నుంచే కాదు ప్రపంచం నుంచి బయటకు పంపే వరకు అంతా ఒకటిగా కలిసి ఉందాం.. ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఈ వైరస్ పూర్తిగా అంతం చేద్దాం అంటూ పిలుపునిచ్చాడు సాయి కుమార్. దయచేసి ఇలాంటి సమయంలో కామెడీ చేయొద్దని కరోనా వైరస్ ప్రాణాలు తీస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. 

More Related Stories