English   

మహేష్ బాబు విషయంలో చిరంజీవి కవర్ చేస్తున్నాడా..

 Chiranjeevi
2020-04-06 14:36:45

ఏమో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చిరంజీవి చెప్పిన సమాధానం చూసి అభిమానులు సరే అనుకుంటున్నారు కానీ విశ్లేషకులు విమర్శకులు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. నిప్పు లేకుండా పొగ రాదు.. ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు ఉన్నప్పుడు కేవలం మహేష్ బాబు మాత్రమే చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ కోసం ఒప్పుకున్నాడు అనే వార్తలు ఎందుకు వస్తాయి అని అడుగుతున్నారు. చిరంజీవి సినిమాలో మహేష్ బాబును నటింపజేయడానికి ఆయనను సంప్రదించారు అనేది నిజమని ఇండస్ట్రీలో కొంత మంది చెబుతున్న మాట. దాని కోసం పరశురామ్ సినిమాను అక్టోబర్ వరకు పోస్ట్ పోన్ చేశాడు సూపర్ స్టార్. కానీ చివరి నిమిషంలో పారితోషికం విషయంలో మహేష్ బాబును కాదనుకున్నారు అని ప్రచారం కూడా జరిగింది. 

అయితే ఇప్పుడు చిరంజీవి మాత్రం అలాంటిదేం లేదు.. తమ సినిమాలో అసలు మహేష్ బాబును అనుకోలేదు.. ఈ వార్త ఎలా బయటికి వచ్చిందో నాకు తెలియదు అంటూ కవర్ చేస్తున్నాడు. ముందు నుంచి కూడా రామ్ చరణ్ ఈ పాత్ర చేయాలని తనతో పాటు దర్శకుడు కొరటాల శివ తన భార్య సురేఖ కూడా కోరుకునేది అని చెప్పాడు చిరంజీవి. ఇక్కడే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అసలు మహేష్ బాబు విషయం ఎందుకు వచ్చింది.. ఎవరు చెప్పకుండా ఆయన పేరు ఎందుకు బయటకు వస్తుంది అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. 

ఈ విషయంలో సూపర్ స్టార్ కూడా కాస్త ఫీల్ అయ్యాడు అని తెలుస్తుంది. కేవలం పారితోషికం విషయంలో తనను పక్కన పెట్టడంతో మహేష్ బాబు కూడా హర్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఆచార్య సినిమా విషయంలో మెగా ట్విస్టులు చాలానే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రామ్చరణ్ ఈ సినిమాల్లో నటించాలన్న కూడా రాజమౌళి పర్మిషన్ తీసుకోవాలి. 

More Related Stories