విజయ్ దేవరకొండకు జిమ్ కష్టాలు.. కండలు పెంచడం ఎలా..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొన్నటివరకు నాన్ స్టాప్ గా జరిగింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎవరికివారు ఇంట్లోనే పరిమితమయ్యారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎలాంటి టెన్షన్ లేకుండా తన నెక్స్ట్ సినిమా కోసం కథ రాసుకుంటున్నాడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం చాలా కష్టాలు పడుతున్నాడు. ఈయన కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. ఈ ఏడాది వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా వరల్డ్ ఫేమస్ డిజాస్టర్ అయిపోయింది. దాంతో కచ్చితంగా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితి పరిస్థితుల్లో పడిపోయాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి సమయంలో ఆయన ఆశలన్నీ పూరి సినిమాపైనే ఉన్నాయి. అందుకే ఫైటర్ సినిమా కోసం తన ప్రాణం పెడుతున్నాడు ఈ హీరో.
ఇలాంటి సమయంలో జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్, లాక్ డౌన్ ఇవన్నీ కలిసి విజయ్ దేవరకొండపై అటాక్ చేస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా.. ఫైటర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు. దాంతో పాటు రోజూ జిమ్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూతో జిమ్ లు కూడా మూతబడిపోయాయి. అందుబాటులో వున్నా ప్రస్తుతం వాటిని ఉపయోగించలేని పరిస్థితి. అందుకే చాలా మంది హీరోలు తమ ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకొని వర్కౌట్స్ చేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ ఇంట్లో జిమ్ సెటప్ లేదు. దాంతో ప్రస్తుతం ఈ హీరో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఎలాగోలా ఇంట్లోనే నార్మల్ వర్కౌట్స్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా ఇంట్లో జిమ్ సెట్ అప్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ దానికి కూడా బయట పరిస్థితులు అనుకూలించడం లేదు.