English   

అల వైకుంఠపురములో.. అలా బాలీవుడ్ రీమేక్ కానుందట.. 

 Akshay Kumar
2020-04-06 22:19:11

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో. నా పేరు సూర్య ఫ్లాప్ తో ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని బన్నీ చేసిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 160 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారు. అక్కడ ఈ చిత్ర హక్కులను భారీ రేట్ కు దక్కించుకున్నాడు ఓ అగ్ర నిర్మాతలు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన అల వైకుంఠపురములో సబ్జెక్ట్ ఎక్కడైనా క్లిక్ అవుతుందని నమ్ముతున్నారు నిర్మాతలు. అందుకే ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా భారీగానే వెళ్లాయి. దాదాపు 13 కోట్ల వరకు ఈ రైట్స్ పలికాయని ప్రచారం జరుగుతుంది. 

ప్రస్తుతం హిందీలో ఈ సినిమా రీమేక్ పనులు కూడా మొదలవుతున్నాయి. గతేడాది అర్జున్ రెడ్డి లాంటి సినిమాను హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసిన నిర్మాత అశ్విన్ వార్డె ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకు తీసుకున్నాడు. ఈ సినిమాను అక్కడ అక్షయ్ కుమార్ లేదంటే షాహిద్ కపూర్ లలో ఎవరో ఒకరితో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు రీమేక్స్ తోనే ఎక్కువగా కాలం నెట్టుకొస్తున్న షాహిద్ తోనే ఈ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడు అశ్విన్. ప్రస్తుతం ఈయన జెర్సీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. మరి చూడాలిక.. మన అల వైకుంఠపురములో అక్కడ ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో..?

More Related Stories