English   

యాంకర్ సుమ కనకాల ఇంట తీవ్ర విషాదం

 Rajeev Kanakala
2020-04-06 15:41:20

యాంక‌ర్ సుమ భ‌ర్త, ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల సోదరి శ్రీలక్ష్మీ ఈ రోజు కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈ రోజు ఉద‌యం త‌న‌ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నటనా వాసనలున్న కుటుంబం నుండి వచ్చినా శ్రీలక్ష్మి తొలుత డాక్టర్ అవ్వాలనుకున్నారు. అయితే ఆమె డాక్టర్ చదువు చదవలేదు. ఆమె కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. 2002లో పెద్ది రామారావుతో శ్రీలక్ష్మి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే సీరియల్ ద్వారా టీవి రంగంలోకి ప్రవేశించిన ఆమె ఆ తరువాత తన తండ్రి దర్శకత్వం వహించిన ఒక సీరియల్ తో పాటు, ఇతర సీరియల్స్ లో నటించింది. అయితే ఆమెకు గతంలో క్యాన్సర్ రాగా దానిని జయించింది. కానీ ఇప్పుడు ఆమెకు కామెర్లు సోకిందని అంటున్నారు. గత మూడు రోజుల నుండి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఈరోజు ఆమె మరణించిందని తెలుస్తోంది. ఈ మరణ వార్త విని సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

More Related Stories