English   

కరోనా హఠావో.. దేశ్ బచావో.. స్టార్ హీరోల షార్ట్ ఫిల్మ్.. 

corona
2020-04-06 16:02:35

కరోనా వైరస్ మహమ్మారిని వీలైనంత త్వరగా దేశం నుంచి కాదు ప్రపంచం నుంచి తరిమేయాలని అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీనికి మందు కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేదు. సమాధానం లేని ఈ ప్రశ్నతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు కరోనాపై అవగాహన కోసం స్టార్ హీరోలంతా కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఉండబోతుంది. ఇందులో ఎవరో చిన్న నటులు కాదు.. ఇండియాలో మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ అంతా కలిసి నటించబోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ సహా మరికొందరు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. కచ్చితంగా ఇది ప్రేక్షకులపై.. ప్రజలపై మరింత అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నారంతా. ఇప్పటికే హీరోలు చేస్తున్న కృషిని చూసి ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. ఇప్పుడు కూడా హీరోలంతా కలిసి తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. 

More Related Stories