English   

అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్న అల్లు అర్జున్..

Allu Arjun AA20.jpg
2020-04-06 22:53:26

అల వైకుంఠపురములో సినిమాతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి మళ్లీ వచ్చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు ముందు కాస్త డల్ పీరియడ్ చూసాడు ఈయన. సరైనోడు రొటీన్ అనే విమర్శలు.. డిజే యావరేజ్.. నా పేరు సూర్య డిజాస్టర్.. ఇలా వరసగా వస్తున్న సమయంలో గ్యాప్ తీసుకుని అల వైకుంఠపురములో సినిమాతో రికార్డులు తిరగరాసాడు ఈయన. ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలోనే సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాను ఎర్ర చందనం స్మగ్లింగ్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది. అనసూయ కీలక పాత్రలో నటించబోతుంది. విలన్ పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. రంగస్థలం తర్వాత ఆ నమ్మకంతోనే మరో కీలక పాత్ర ఇస్తున్నాడు సుకుమార్. శేషాచలం అనే టైటిల్ రిజిష్టర్ చేయించినట్లు తెలుస్తుంది. ఇందులో శేషాచలం అనే రాయలసీమ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు ఇదే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఏమబ్బా, అందరూ బాగుండారా, మీరు ఎపుడెప్పుడా అని అని చూస్తాండే.. ఏప్రిల్ 8న తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.

Ready కాదండబ్బా అంటూ రాయలసీమ యాసలో ట్వీట్ చేసారు. దీన్నిబట్టి సినిమాలో రాయలసీమ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైపోతుంది. ముఖ్యంగా ఇందులో ఈ యాస కోసం ముగ్గురు ట్యూటర్లను పెట్టుకున్నాడు బన్నీ. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ సర్ఫ్రైజ్ ఇస్తున్నారు. మరి చూడాలిక.. ఆ సర్ ప్రైజ్ ఎలా ఉండబోతుందో..?

More Related Stories