English   

తమ్మారెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి..

chiru
2020-04-07 07:11:32

ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌ ఇంట్లో విషాదం జరిగింది. ఈయన తల్లిగారు కృష్ణ‌వేణి మరణించారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఎప్రిల్ 6న కన్నుమూసారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబం. ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఫోన్ లో ఆయన్ని పరామర్శించారు. కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

More Related Stories