English   

ఆచార్యలో నిహారిక.. మెగాస్టార్‌కు తప్పట్లేదుగా..

niharika
2020-04-07 07:19:37

ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పది మందిలో ఐదు మంది మెగా అభిమానులే. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అరడజను మంది హీరోలు వచ్చారు. అందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని మార్కెట్ ఏర్పరుచుకున్నారు. అల్లు శిరీష్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. వీళ్ళందరూ ఇలా ఉంటే తాను కూడా ఇదే కుటుంబం నుంచి వచ్చాను అంటూ నిహారిక కొణిదెల కూడా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. తొలి సినిమా ఒక మనసు డిజాస్టర్ కాగా.. రెండో సినిమా హ్యాపీ వెడ్డింగ్, మూడోది సూర్యకాంతం కూడా ఇదే ఫలితం రిపీట్ అయింది. దానికి తోడు తమిళనాట విజయ్ సేతుపతితో నటించిన సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తనకు సినిమాలు రావడం లేదని ఒక నిర్ణయానికి వచ్చింది కొణిదెల నిహారిక. ప్రస్తుతం ఈమె సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తుంది. అందుకే ఆ వైపుగా కథలు వినడం మొదలు పెట్టింది. గతేడాది సైరాలో చిన్న పాత్ర చేసింది ఈమె. కథకు పెద్దగా హెల్ప్ అయ్యే పాత్రేం కాదు. ఇప్పుడు కొరటాల ఆచార్యలో కూడా నిహారిక నటించబోతుందని తెలుస్తుంది. అయితే సైరా మాదిరి కాకుండా ఇందులో కాస్త కీలకమైన పాత్రలో నటింబోతుందని ప్రచారం జరుగుతుంది. కాస్త లెంత్ ఉన్న పాత్ర కూడా. చిరంజీవి ఒక్కడే నిహారికకు అవకాశాలు ఇస్తున్నాడు. మిగిలిన మెగా హీరోలు కూడా ఈమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో సినిమాలు పూర్తిగా మానేయాలన్న ఈమె నిర్ణయం కూడా కరెక్టే అంటున్నారు అభిమానులు కూడా. హాయిగా వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వెళ్లిపోవడమే బెటర్ అంటున్నారు వాళ్లు.

 

More Related Stories