త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టిన మహేష్

మహేష్ బాబు – త్రివిక్రమ్ లది ఎవరు కాదన్నా ఒక మంచి కాంబినేషన్. అతడు లాంటి సినిమా ఈరోజు వచ్చినా టీవీలు వదలకుండా చూస్తారు. ఇక ఖలేజా థియేటర్లలో దెబ్బ వేసిన టీవీలలో మాత్రం ఎప్పుడు వచ్చినా వదలకుండా చూస్తుంటారు. అసలు ఖలేజా ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా కాదనేది దాదాపు అందరి అభిప్రాయం. ఇక మొన్న సంక్రాంతికి ఇద్దరూ వేర్వేరు సినిమాలతో రంగంలోకి దిగి ఇద్దరూ హిట్ లు కొట్టారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఒకటి వస్తే బాగుండు అని అభోమనులు ఎదురుచూస్తున్నారు. దానికి ఇప్పుడు రూట్ క్లియర్ అవుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వంశీతో క్యాన్సిల్ అయిన సినిమా పరశురామ్ తో ఫిక్సయిపోయింది. అయితే ఆ సినిమా తరువాత సినిమా కోసం కూడా మహేష్ పని మొదలు పెట్టాడట. అందులో భాగంగానే మహేష్ త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టాడని అంటున్నారు. కుదిరితే చెప్పండి..సినిమా ప్లాన్ చేద్దాం అని మహేష్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటకే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా సైతం ఫిక్సయిపోయింది. కానీ కరోనా కాటు వలన ఎన్టీఆర్ కాల్షీట్లు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయన్నది స్పష్టం కాలేదు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమా ఆలస్యమై, ఈమధ్యలో మరో సినిమా చేసేంత సమయం ఉన్నట్టయితే మహేష్ తో సినిమా చేసేయచ్చని అంటున్నారు. అయితే మరి పరశురామ్ ఏం చేస్తాడనే అనుమానం ఉండిఉండవచ్చు, కానీ పరశురామ్ ని మహేష్ ఇప్పటికీ ఓ ఆప్షన్‌గానే భావిస్తూన్నాడని అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.