English   

క్రేజీ కాంబినేషన్ సెట్...బాలయ్యతో సినిమాకి ఓకే చెప్పిన రానా 

Balakrishna
2020-04-07 11:36:47

ఈ మధ్య ఏదయినా ఒక సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నాం అంటే అది ఆర్ఆర్ఆర్ అనే చెప్పాలి. ప్రపంచం అంత అమ్మో కరోనా అని భయపడుతున్న ఈ సమయంలో మన సినిమాలు సినిమా అప్డేట్స్ మాత్రమే జనాన్ని కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చిరంజీవి ఆచార్య గురించి కూడా బాగా ఎక్కువగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ఒక మళయాళ సినిమా గురించి తెలుగు ఫిలిం నగర్ లో చర్చలు జరగడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. ఎందుకంటే మ‌ల‌యాళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` అనే సినిమాని తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెలుగు హక్కులు కొనడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అందులో ఒక పాత్ర బాలయ్య చేస్తే బావుంటుంద‌ని నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ భావిస్తున్నార‌ని మరో పాత్రకు మంచు విష్ణుని నటింపచేయనున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత మరో ప్రచారం కూడా తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో విష్ణు నటిస్తాడని ప్రచారం జరిగిన పాత్రలో ద‌గ్గుబాటి రానా న‌టించ‌బోతున్నట్లు చెబుతున్నారు. 

సచే దర్శకత్వం వహించిన  మలయాళ  చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఈ మూవీలో   పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇద్దరు వ్యక్తుల ఇగో వల్ల వచ్చే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా  మళయాల క్రిటిక్స్ ప్రశంసలను అందుకుంది. బిజూ మీనన్ పాత్ర కోసం రానా ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. బాలకృష్ణ – రానా మధ్య గల సాన్నిహిత్యం కారణంగా ఈ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన సానిహిత్యం ఈ ప్రాజెక్ట్ సెట్ కావడానికి ఉపయోగపడిందని అంటున్నారు.

More Related Stories