గోదావరి జిల్లా అమ్మాయిగా కీర్తి సురేష్

ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఒప్పుకుని నటిస్తూ బిజీగా ఉన్నాడు నితిన్. మొన్ననే భీష్మ హిట్ కొట్టిన ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ కరోనా కాటు వేయడంతో అది కూడా వాయిదా పడింది. ఇక ఆయన చేస్తున్న తదుపరి సినిమా `రంగ్ దే`. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుదల కాకుండానే మరో నితిన్ సినిమాలో కూడా నితిన్ సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా ఆమె నాయికగా నటించే ఛాన్స్ దక్కించుకుందని అంటున్నారు. ఛల్ మోహన రంగ` తరువాత నితిన్, దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్లో ‘పవర్ పేట’ పేరుతో మరో చిత్రం రాబోతోంది. ఈ సినిమాలోనే కీర్తి సురేష్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందని తెలిసింది.
గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడే ఏలూరు అమ్మాయిగా కీర్తి కనిపించనుందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాని ముందు నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో నిర్మించాలనుకున్నారు. అయితే ఏమయిందో ఏమో ఆ ప్రాజెక్ట్ సితార ఎంటర్టైన్మెంట్ వద్దకు వెళ్లింది. అక్కడి నుండి పవర్‌పేట చేతులు మారి పీపుల్ మీడియా వారి దగ్గరికి చేరింది.