English   

అల్లు అర్జున్ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్.. 

allu arjun
2020-04-07 14:10:55

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకులు. ముఖ్యంగా వాళ్ళ అభిమానుల ఇగోలు హర్ట్ కాకుండా పవర్ ఫుల్ టైటిల్స్ పెడుతున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు మాత్రం సుకుమార్ ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నాడు. ఈయన బన్నీతో చేస్తున్న సినిమాకు పుష్ప అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ముందు దీనికి శేషాచలం అనుకున్నారు కానీ దానికంటే పుష్ప ఇంట్రెస్టింగ్ గా ఉందని దానికి ఫిక్సైపోయినట్లు తెలుస్తుంది. ఇదే టైటిల్ రిజిష్టర్ కూడా చేయించారని ప్రచారం జరుగుతుంది. ఇందులో రష్మిక మందన్న పేరు పుష్ప అని.. దాంతో అదే టైటిల్ కన్ఫర్మ్ చేసారని తెలుస్తుంది. బన్నీ లాంటి స్టార్ హీరో సినిమాకు హీరోయిన్ పేరును టైటిల్ గా పెట్టడం నిజంగానే సాహసం అవుతుంది. 

అయితే ఆమె పేరునే టైటిల్ అంటున్నారు అంటే ఈ సినిమాలో రష్మిక కారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ఎప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుండి అప్ డేట్ ఈ టైటిల్ గురించే రాబోతుందని తెలుస్తుంది. రంగస్థలం తరహాలోనే ఇది కూడా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కుతుందని.. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రంగస్థలంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్.. అల వైకుంఠపురములో తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. 

More Related Stories