English   

మాది బాడుగ తెగ.. సాయి పల్లవి సంచలన విషయాలు..

Sai Pallavi
2020-04-07 14:24:39

తెలుగు ఇండస్ట్రీలో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఎవరైనా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని అంటారు ఈమె డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయింది కార్డియాలజీ చేసి హాయిగా పేషెంట్స్ తో ఉండాలనుకున్న తను ఊహించని విధంగా సినిమాల్లోకి వచ్చింది ఫిదా సినిమా కంటే పదేళ్ల ముందే ఢీ డాన్స్ షో లో సాయి పల్లవి కంటెస్టెంట్ గా చేసింది. ఆ తర్వాత నటన వైపు వచ్చింది. మధ్యలో చదువుకుని డాక్టర్ అయిపోయింది పల్లవి. కార్డియాలజిస్ట్ అయ్యేదాన్ని అని చెప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. స్టెత్ పట్టుకుని గుండె కొట్టుకోవడం చూడాల్సిన తను.. ఇలా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేలా సినిమా చేసింది అంటూ చెబుతుంది సాయి పల్లవి.

అంతేకాదు తాను సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నట్లు చెప్పింది ఈమె. శేఖర్ కమ్ము ఫిదా సినిమా కోసం ట్రాక్టర్ నేర్చుకున్నానని చెప్పింది.. అలాగే మాగాణిలో ట్రాక్టర్ నడపడం చాలా కష్టమని ఆమె తెలిపింది. తన పెళ్లి విషయాలను కూడా ఆమె మాట్లాడింది. ఫిదాలో వరుణ్ లాంటి అబ్బాయి కనిపిస్తే వెంటనే 'ఐ లవ్యూ చెప్పేస్తా' అని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది. తనను చాలా మంది మళయాలీ అమ్మాయి అని అనుకుంటారని.. కానీ కాదని.. తనది తమిళనాడులోని 'బడుగ' అనే గిరిజ తెగ అని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పింది సాయి పల్లవి. తన మాతృభాష బడుగకు లిపి కూడా లేదని ఆమె చెప్పుకొచ్చింది. నిజంగా సాయిపల్లవికి సంబంధించిన ఈ వ్యక్తిగత విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

More Related Stories