English   

సాయి పల్లవి ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా... 

Sai Pallavi
2020-04-07 14:49:00

సాయి పల్లవి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది ఈమె. తన కులంతో పాటు అన్ని విషయాలను కూడా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఇదిలా ఉంటే తనకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం అని చెబుతుంది ఈమె. మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యరాయ్‌లను చూసి డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పింది సాయి పల్లవి. వాళ్లే తనకు చాలా ఇష్టమని చెబుతుంది పల్లవి. హీరోల విషయంలో సూర్య అంటే ప్రాణం అంటుంది. 

చిన్నప్పుడు చదువుకున్న కోయంబత్తూర్ అంటే తనకెంతో ఇష్టమని.. ఇప్పటికి కూడా షూటింగ్‌లు లేకపోతే అక్కడికే వెళ్లిపోతానని కూడా ఆమె ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఎందుకంటే ఆ వాతావరణానికి తానెంతగానో కనెక్ట్ అయ్యానని సాయి పల్లవి తెలిపింది. ఇక అభిమాన హీరో విషయానికి వస్తే కాలేజ్ డేస్ నుంచి తనకు సూర్య అంటే ప్రాణం అని చెప్పింది. అలాంటి సూర్యతో ఎన్జీకే సినిమాలో నటించేటప్పుడు తను ఆకాశంలో ఉన్నట్టు చెప్పింది ఈమె. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా ఆయన్నే చూస్తూ కూర్చునేదాన్ని అంటుంది పల్లవి. సూర్యతో నటించడం తన అదృష్టం అంటుంది ఈమె. ఇక ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే దర్శకుడు రీషూట్ చేశారని సాయి పల్లవి చెప్పింది. దీంతో ఒకరోజు సినీరంగాన్ని వదిలేస్తానని అమ్మకు చెప్పి ఏడ్చేశానని.. కానీ దర్శకుడు ఏం చేసినా కూడా సినిమా కోసమే అని తెలిసి పాజిటివ్ గా తీసుకున్నట్లు చెప్పింది ఈ బ్యూటీ. 

More Related Stories