English   

పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్క.. నిజమెంత..

pk
2020-04-07 19:28:16

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస సినిమాల్లో అయితే చేస్తున్నాడు. కానీ ఆయనతో జోడీ కట్టి హీరోయిన్ల విషయంలో మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉన్నారు దర్శక నిర్మాతలు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా చెప్పలేదు. పూజా హెగ్డే, శృతి హాసన్ లాంటి పేర్లు వినిపిస్తున్న కూడా ఇంతవరకు కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే పింక్ సినిమా రీమేక్ లో హీరోయిన్ ఎవరో తెలియదు కానీ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మాత్రం అనుష్కతో పవన్ కళ్యాణ్ జోడి కట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. భాగమతి సినిమా తర్వాత భారీ బ్రేక్ తీసుకుంది అనుష్క. ప్రస్తుతం ఈమె నిశ్శబ్దం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఒకప్పటిలా స్టార్ హీరోలు ఎవరు ఈమె వైపు చూడటం లేదు. కుర్ర హీరోలకు అనుష్క సరిపోయే ఫిజిక్ లేదు. దాంతో ఖాళీగా ఉండటం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేకపోతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్కకు అద్భుతమైన అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నాయి దర్శకుడు క్రిష్. పీరియాడికల్ సినిమా కావడంతో అనుష్క అయితే బాగుంటుందని భావిస్తున్నాడు ఈ దర్శకుడు. గతంలో ఈమెతో వేదం లాంటి డిఫరెంట్ సినిమా చేశాడు క్రిష్. ఆ నమ్మకంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. 2021 లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు క్రిష్. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే నిజంగానే పవన్ కళ్యాణ్ తో అనుష్క జోడి కడితే మాత్రం అద్భుతమైన అవకాశం దక్కినట్లే.

More Related Stories