English   

కరోనా కారణంగా హాట్ స్టార్‌లో కొత్త సినిమా..

hotstar
2020-04-07 20:01:48

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా నష్టాల పాలవుతుంది. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆగిపోయాయి. ఇక విడుదలైన సినిమాలకు కలెక్షన్లు లేవు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన సినిమా ఆంగ్రేజీ మీడియం. క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఈయన నటించిన తొలి సినిమా ఇదే. ఈయన క్యాన్సర్‌ను జయించాడు కానీ.. ఆయన సినిమాను కరోనా నుంచి మాత్రం కాపాడుకోలేకపోయాడు. మార్చ్ 13న విడుదలైన అంగ్రేజీ మీడియంకు కలెక్షన్లు అస్సలు రాలేదు. ఓపెనింగ్స్ పై కరోనా ఎఫెక్ట్ చూపించింది.. ఆ తర్వాత పూర్తిగా థియేటర్స్ బంద్ చేసారు. దాంతో నిర్మాతలకు తీవ్ర నష్టం వచ్చింది. ప్రేక్షకులే కాదు.. సినిమా ప్రముఖులు ఎవరూ విడుదలైన తొలి రెండు మూడు రోజుల్లో సినిమా చూడలేకపోయారు. దాంతో ఇప్పుడు చేసేదేం లేక అంగ్రేజీ మీడియం సినిమాను డిజిటల్‌లోకి విడుదల చేసారు. హాట్ స్టార్ యాప్‌లో ఈ సినిమా విడుదలైంది. ఒరిజినల్ వర్షన్ చూసి ఇప్పుడు అంతా ఖుషీ అవుతున్నారు. అర్రే.. సినిమా బాగుందే అనవసరంగా కరోనాకు బలైపోయిందిగా పాపం అంటున్నా

More Related Stories