English   

విజయశాంతిని భరించలేం అంటున్న నిర్మాతలు...

Vijayashanthi.jpg
2020-04-07 22:02:55

13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. ఈ సినిమాలో చాలా పవర్ పుల్ రోల్ చేసానని చెప్పింది కానీ ఆమె ప్రత్యేకంగా చేయాల్సిన పాత్ర అయితే కాదు అది. ఎవరు చేసినా కూడా ఓకే అనిపించే పాత్రనే విజయశాంతి బాగా ప్రస్టేజియస్ గా తీసుకుందని విమర్శలు కూడా తేల్చేసారు. అయితే ఈ సినిమా కథ నచ్చడంతో నటించానని చెప్పింది విజయశాంతి. ఎన్నో ఏళ్లుగా నటనకు దూరంగా ఉన్న తనకు అనిల్ రావిపూడి చెప్పిన కథ కాస్త బెటర్ గా అనిపించిందని.. రీ ఎంట్రీకి బాగుంటుందని ఆలోచించి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించానని చెప్పారు విజయశాంతి.

ఇందులో ఆమెది నెగెటివ్ పాత్ర అని అడిగినందుకే అప్పుడు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. విజయశాంతి ఎప్పుడు నెగిటివ్ రోల్స్ చేయదు.. నేను పాజిటివ్ పర్సన్ అలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను అంటోంది ఈ సీనియర్ హీరోయిన్. ఇకపై అమ్మ వదిన పాత్రలు చేస్తారా అంటే అసలు సమస్యే లేదు.. విజయశాంతిని అభిమానులు అలా చూడలేరు అంటూ సమాధానం చెప్పింది ఈమె. మదర్ ఇండియా లాంటి స్క్రిప్ట్ వస్తే తల్లి పాత్ర చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని.. అలా కాకుండా సింపుల్ రోల్స్ తన వల్ల కాదు అంటుంది విజయశాంతి. విభిన్నమైన పాత్రలు వచ్చినప్పుడు కచ్చితంగా ఇకపై సినిమాల్లో నటిస్తానని క్లారిటీ ఇచ్చింది ఈ లేడీ సూపర్ స్టార్. అయితే ఇప్పుడు మాత్రం ఈమె వైపు చూడ్డానికి కూడా నిర్మాతలు భయపడుతున్నారు. ఎలాగు ఎన్నికలు అయిపోయాయి. రాబోయే ఐదేళ్ల వరకు విజయశాంతి చేసేది కూడా ఏమీ ఉండదు.

అందుకే దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఈమె రెమ్యునరేషన్ తో పాటు ఆమె కోరికలు విన్న తర్వాత వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. హీరోయిన్లకు ఇచ్చేంత దానికంటే కూడా ఎక్కువ పారితోషికం అడుగుతుండటంతో పాటు హీరోకు ఉన్న ఫెసిలిటీస్ అన్నీ తనకు కూడా కావాలని విజయశాంతి అడుగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె వైపు చూడ్డానికి నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు.

More Related Stories