English   

అభిమానికి గుండె ఆపరేషన్ చేయిస్తున్న చిరంజీవి..

chiru
2020-04-08 07:31:57

మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆయన అందరివాడు అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు అందరివాడిగా ఉన్న అన్నయ్య.. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి కొందరి వాడుగా మిగిలిపోయాడు. దాంతో మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసాడు.. ఒకప్పుడు ఆయన మాటంటే అందరికీ వేదం.. అభిమానులకు ఆయన దైవం. సేవా కార్యక్రమాలు కూడా బాగానే జరిగేవి. కానీ చిరు రాజకీయాల తర్వాత కొన్ని తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ చిరు ముందుకొస్తున్నాడు. తనకు తోచిన సాయం చేస్తున్నాడు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ అభిమానికి శస్త్రచికిత్స చేయించేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చాడు. గుంటూరు జిల్లా `చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ` అధ్యక్షురాలు నాగలక్ష్మి కొద్దికాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించాడు. ఆమెకు పిలిపించి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. మెడికల్‌ రిపోర్ట్స్‌ పరిశీలించి ఆమెను వెంటనే హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు చేశారు. ఎప్రిల్ 8న నాగలక్ష్మికి గుండె ఆపరేషన్ చేయించబోతున్నారు. మొన్నటికి మొన్న జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విషయంలో కూడా చిరు ముందుగానే స్పందించాడు. అయితే ఆయన అశ్రద్ధ చేయడంతో కొన్ని రోజుల కింద మరణించారు రామారావు.

More Related Stories