English   

‘పుష్ప’ లో అల్లు అర్జున్ మాస్ లుక్ అదిరింది...

Allu Arjun Pushpa.jpg
2020-04-08 10:59:39

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ సినిమాకి పుష్ప అనే పేరు పెడుతున్నారని నిన్న ప్రచారం జరిగినట్టుగానే ఈ రోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప అనే టైటిల్ ను, అందులో బన్నీ లుక్ ను విడుదల చేసారు మేకర్స్. అల వైకుంఠపురములో లాంటి హిట్ తర్వాత సుకుమార్ తో ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తుండడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి ముందు నుండీ శేషాచలం అనే టైటిల్ ప్రచారం జరిగినా తన సెంటిమెంట్ మేరకు రెండక్షరాల పేరుకే సుకుమార్ ఫిక్స్ అయ్యాడు.

నిజానికి అల్లు అర్జున్ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సిన టైంలో కరోనా ఎఫెక్ట్ వలన ఈ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. ఈ టైంలో తన పుట్టిన రోజున అల్లు అర్జున్ తన ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడం కోసం సుకుమార్ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు నిన్ననే అనౌన్స్ చేశారు. అన్నట్లుగా సరిగ్గా 9 గంటలకి అల్లు అర్జున్ – సుకుమార్ మూవీ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో అదిరిపోయాడు.

అడవి-స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా నటించానున్నాడనే ప్రచారం అయితే జరుగుతోంది.  టైటిల్ లో రోడ్లమీద వాహనాలు విపరీతంగా తిరిగితే పడే ముద్రలను చూపడంతో ఇందులో లారీ డ్రైవర్ పాత్ర అని ఫిక్స్ అయిపోవచ్చు. రష్మిక హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

More Related Stories