English   

కొత్త కెరీర్ మొదలెట్టనున్న ఇల్లీ బేబీ...యాంకర్ అంట 

  Ileana DCruz
2020-04-08 12:30:37

గోవా బ్యూటీ ఇలియానా బ్లాక్ బస్టర్ “దేవదాసు” మూవీతో టాలీవుడ్ లో ప్రవేశించింది. ఆమె నటించిన పోకిరి, రాఖీ, జల్సా, కిక్ , జులాయి లాంటి సినిమాలు ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ మూవీ “బర్ఫీ” హిందీ మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా, హిందీ మూవీస్ తో బిజీ అయ్యి తెలుగు మూవీస్ లో నటించలేదు. మళ్ళీ  ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది ఈ భామ. ఆమధ్య తెలుగులో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడు వర్కవుట్ కాలేదు. చివరికి రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా అది హిట్ కాకపోవడంతో అప్పటి నుండి సైలెంట్ గా ఉంది ఈ భామ. 

 అయితే ఆ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపించడం మొదలు పెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ కావంతో మళ్ళీ ఘనంగా రీ ఎంట్రీ ఇవ్వాలని ఇలియానా ఆశిస్తోందని అందుకే అందాలు ఆరబోస్తోంది అనే ప్రచారం అయితే జరిగింది. అయితే ఇలియానా ఇప్పుడు ఒక కొత్త కెరీర్ ను ఎంపిక చేసుకుంటున్నదని ప్రచారం జరుగుతోంది. యాంకర్ గా మారేందుకు ఇలియానా ఒక స్పోర్ట్స్ ఛానల్ ను కూడా సంప్రదించినట్టు, దానికి స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో త్వరలో ఇలియానా స్పోర్ట్స్ ఛానల్ యాంకర్ గా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని అంటున్నారు.  

More Related Stories