English   

సిరీస్ అయినా హెబ్బా కెరీర్ ని నిలబెడతాయా.. 

Hebah Patel
2020-04-08 12:52:00

హెబ్బా పటేల్ 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆ ఒక్క సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హెబ్బా. ఆ తర్వాత ఆ అమ్మడికి చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా తగల్లేదు. అరడజను సినిమాలు చేస్తే అందులో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కాస్త హిట్ అయ్యింది. అయితే సినిమాలు ఏవీ ఆడకున్నా ఆమె మాత్రం సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే సినిమాలు రాకుంటే ఏమిలే బాలీవుడ్ హీరోయిన్స్ తరహాలోనే వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. 

ఇప్పటికే ఆహా యాప్ కోసం క్రిష్ చేసిన మస్తిస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది హెబ్బా. ఇక సినిమాలు ఏవీ రావని ఫిక్స్ అయిందో ఏమో కానీ వరుసగా వెబ్ సిరీస్ లు ఒప్పుకుందని అంటున్నారు. అల్లు వారి ఆహాలో ప్రసారమయ్యే రెండు వెబ్ సిరీస్ ల్లో హెబ్బాను ఓకె చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ రాం ‘రెడ్’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో హెబ్బా కనిపించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం కనిపించబోతుందట. మరి ఈ సిరీస్ అయినా అమ్మడి కెరీర్ ని నిలబెడతాయేmo చూడాలి మరి.

More Related Stories