English   

హ్యాపీ బర్త్ డే అఖిల్ అక్కినేని.. 

Akhil birthday
2020-04-08 14:56:12

వరుసగా మూడు ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయిన అక్కినేని వారసుడు.. ఇప్పుడు నాలుగో సినిమాతో వస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో వస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఎప్రిల్ 8న అక్కినేని అఖిల్ పుట్టిన రోజు. ఏడాది వయసులోనే సిసింద్రీ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ కొట్టాడు అఖిల్. తర్వాత కొన్నేళ్ల పాటు చదువుతో బిజీ అయిపోయి 2015లో అఖిల్ అంటూ హీరోగా వచ్చాడు. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా అఖిల్ అంచనాలు నిలబెట్టలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్కినేని కుటుంబంలో తొలి మాస్ హీరో అయ్యే లక్షణాలు కేవలం అఖిల్ కు ఒక్కడికే ఉన్నాయని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు హిట్ కొట్టకపోయినా కూడా కచ్చితంగా కొట్టిన రోజు మాత్రం అఖిల్ స్టార్ అవుతాడని నమ్ముతున్నారు వాళ్లు. కాస్త లేట్ అయినా కూడా వందశాతం బాక్సాఫీస్ ను కుమ్మేస్తాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి చూడాలిక.. అఖిల్ వాళ్ల ఆశలను ఎప్పుడు నెరవేరుస్తాడో..? అన్నట్లు అఖిల్ కు ఇండస్ట్రీ నుంచి చాలా మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి కూడా చెప్పాడు. 

More Related Stories