English   

నువ్వు ఇంకా ఎదగాలిరా.. అకిరాకు చిరు బర్త్ డే విషెస్.. 

Chiranjeevi
2020-04-08 15:14:34

ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.. ఒక్క‌సారి కూడా ఏ వీడియోలో క‌నిపించ‌లేదు.. క‌నీసం కెమెరా ముందుకొచ్చి మాట్లాడ‌లేదు.. అయినా కూడా అకీరా నంద‌న్ అంటే తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ తెలుసు. దానికి కార‌ణం అత‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు కావ‌డ‌మే. రేణుదేశాయ్, ప‌వ‌న్ తన‌యుడే అకీరా నంద‌న్. ఈ కుర్రాడు ఇప్పుడు పూణేలో త‌ల్లితో క‌లిసి ఉంటున్నాడు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా చిన్న‌పిల్లాడిగానే అకీరా అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ కుర్రాన్ని చూస్తుంటే కుర్రాడు అన‌డానికి నోరు కూడా రాదు. ఈ మ‌ధ్యే తండ్రి ప‌వ‌న్ తో క‌లిసి వైజాగ్ లో చూసిన‌పుడే అకీరా హైట్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చెప్పాడు. ఎప్రిల్ 8న ఈయన పుట్టిన రోజు. 

దాంతో అకిరా పుట్టినప్పుడు ఫోటో తీసుకున్న చిరు.. నువ్వు ఇప్పటికే అందరికంటే ఎత్తు ఎదిగావు అంటూ హైట్ చూపించాడు. పవన్ కొడుకు ఇప్పుడే 6.4 అడుగులున్నాడు.. కెరీర్ లో కూడా ఇంతే ఎత్తు ఎదగాలని.. అందర్నీ మించిపోవాలని ఆశిస్తున్నట్లు బర్త్ డే విషెస్ చెప్పాడు మెగాస్టార్. నీకు పవర్ ఫుల్ ఫ్యూచర్ ఉండాలంటూ కోరుకున్నాడు. ఈ ఫోటోను.. చిరు విషెస్ చూసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. ముఖ్యంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ లో ఎక్క‌డ‌లేని జోష్ నింపుతుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు చిన్న పిల్లాడిలా క‌నిపించిన అకీరా.. అప్పుడే ఇంత ఎదిగిపోయాడా అంటూ సంబ‌రాలు చేసుకుంటున్నారు అభిమానులు. 

16 ఏళ్ల‌కే 6.4 అడుగులు పెరిగిపోయాడు అకీరా నంద‌న్. ప‌వ‌న్ అత‌డికి ఆస్తులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు.. పేరు ఇచ్చాడు చాలు. రేపు ఫ్యూచ‌ర్ లో ప‌వ‌న్ కొడుకు అనే బ్రాండ్ తోనే అకీరా స్టార్ అయిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అకీరా ఎదుగుద‌ల చూస్తుంటే మ‌రో మూడు నాలుగేళ్ల‌లోనే హీరోగా వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. మొత్తానికి అకీరాను చూసి ఇప్పుడు అత‌డి పెద‌నాన్న చిరంజీవి పాటే.. అదేనండీ ఎంత ఎదిగిపోయావ‌య్యా అంటూ పాడాలేమో..?

More Related Stories