English   

మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి కథ..

 Chiranjeevi
2020-04-08 15:25:33

చిరంజీవి సోషల్ మీడియాలో దున్నేస్తున్నాడు. ఈయన జోరు తట్టుకోవడం ఎవరితరం కావడం లేదు. ఒక్కరోజే దాదాపు 10 నుంచి 15 ట్వీట్స్ చేస్తున్నాడు మెగాస్టార్. ఇంట్లో ఖాళీగానే ఉండటంతో అందరికీ గుర్తు పెట్టుకుని మరి విషెస్ చెబుతున్నాడు. ఎప్రిల్ 8 నాకు చాలా ప్రత్యేకం.. ఎందుకో చెప్తాను అంటూ మొన్న చెప్పిన చిరు.. ఇప్పుడు అసలు విషయం చెప్పాడు. సరిగ్గా ఇదే రోజు 58 ఏళ్ల కింద అంటే 1962లో ఓ లాటరీలో తనకు హనుమంతుడి బొమ్మ వచ్చిందని చెప్పాడు చిరు. అది ఇంటికి తీసుకొచ్చి చూపిస్తే అది చూసిన తన నాన్న వెంకట్రావు చాలా సంతోషించాడని.. అంతేకాదు నీ కనుబొమ్మలు, కన్ను, ముక్కు అన్నీ అచ్చం అలాగే ఉన్నాయి అంటూ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ హనుమాన్ బొమ్మ తన దగ్గరే ఉందని చెప్పాడు చిరు. హనుమాన్ జయంతి కానుకగా తన జీవితంలో జరిగిన ఈ గుర్తును అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్. అంతేకాదు.. ఎప్రిల్ 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, అకీరా నందన్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపాడు చిరు. అందరూ బాగుండాలని కోరుకున్నాడు. 

More Related Stories