కరోనా బాధితులకు పవన్ కళ్యాణ్ స్నేహితుడి సాయం..

కరోనా నివారణ కోసం ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు విరాళం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త, పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తళ్లూరి 5.5 లక్షల విరాళం అందించాడు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే కరోనా నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు తమ వంతు సాయంగా ఈయన 5.5 లక్షల రూపాయలు విరళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో 5 లక్షల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి ప్రకటించారు ఈయన. మరో 50 వేలు నిత్యావసరాల సరుకులు సినీ కార్మీకులకు అందించారు. తాను అధినేతగా వ్యవహరిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్ధలు తరుపున రామ్ తళ్లూరి ఈ విరాళం అందించారు. గత నెలలో తన కంపెనీ పని మీద అమెరికా వెళ్లిన రామ్ తళ్లూరి లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే నిలిచిపోయారు.