సోనమ్.. అందాలతో గుచ్చావ్ గా గుండెల్లో బాణమ్..

ఈ ఫొటోలు చూసిన తర్వాత ఇంతకంటే ఎవరు మాత్రం ఏం అంటారు చెప్పండి..? అమ్మడికి పెళ్లైన సంగతి కూడా మరిచిపోయినట్లుంది. అందుకే హాట్ హాట్ గా ఇలా సోకుల వడ్డన చేస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కసారి కమిటైతే వాళ్ల మాట వాళ్లే వినరు. ఇంక మొగుడి మాట ఎక్కడ వింటారు. ఇప్పుడు సోనమ్ కపూర్ కూడా ఇదే చేసింది. స్టైల్.. యూత్ ఐకాన్.. ఇలాంటి పదాలకు నిలువైన నిదర్శనం సోనమ్ కపూర్. ఉత్తరాదిన ఎంతమంది ముద్దుగుమ్మలైనా ఉండొచ్చు కానీ కచ్చితంగా వాళ్లలో సోనమ్ కపూర్ మాత్రం వేరు. ఈమె స్టైల్ కు ఐకాన్ కాదు.. కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఉత్తరాదిన మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ ఎవరు అంటే మరో మాట లేకుండా ఎవరైనా చెప్పే సమాధానం సోనమ్ కపూర్ అని. హాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్తరపోయే స్టైల్ ఫాలో అవుతుంటుంది ఈ భామ. హద్దులు దాటడం అంటే ఈ భామకు మరీ సరదా.
దాటిన ప్రతీసారి మరీ ఇంతగా దాటడమని ఎవరికీ తెలియదు కాబోలు.. అందుకే సోనమ్ సోకులు చూసి ప్రతీసారి షాక్ అవుతుంటారంతా. ఇప్పుడు కూడా ఈమె ఇదే చేసింది. ఈ మధ్యే పెళ్లైనా కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి సోనమ్ అందాల ఆరబోత హైలైట్ అయింది. పాత పోజులతో పాటు ఇప్పుడు మరికొన్ని ఫోటోషూట్ లతో రచ్చ చేస్తుంది సోనమ్. ఆ మధ్య భర్త ఆనంద్ ఆహూజాతో పాటే అందాలు ఆరబోసిన సోనమ్.. ఇప్పుడు సోలోగా మంట పెట్టింది. అసలు ఆమెను అలా చూసి బాబోయ్ ఏంటి తెగింపు అనుకోకుండా ఉండలేరు. మొత్తానికి పెళ్లి తర్వాత తానేం మారలేదని హింట్ ఇస్తుంది సోనమ్ కపూర్. పైగా భర్త ముందే అలా అందాలన్నీ ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ