English   

మందు దొరక్క ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్యాయత్నం..

Manorama son Bhoopathi
2020-04-08 23:04:35

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వైన్ షాపులు అక్కడే బంద్ అయిపోయాయి. దాంతో మందు బాబులకు నోరు కట్టేసినట్లైంది. దాంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. మరికొందరు పిచ్చోళ్లుగా మారిపోతున్నారు.. ఇంకొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. మద్యానికి బానిసైన వాళ్లకు సాయంత్రానికి చుక్క పడకపోతే ఇలాగే ప్రవర్తిస్తారని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఓ దారుణంగా చోటు చేసుకుంది. ప్రముఖ దివంగత నటి మనోరమ తనయుడు భూపతి కూడా నిద్రమాత్రలు మింగేసాడు. మద్యానికి బానిసైన అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నాడు. కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని రోజులుగా మద్యం షాపులు మూతపడ్డాయి. దాంతో మందుకు బానిసైన భూపతి రెండు మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి మందు లేదని తెలిసి ఆయన నిద్రమాత్రలు మింగేసాడు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

More Related Stories