English   

సమంత అక్కినేని గర్భంతో ఉందా.. ఏంటి కథ..

sam
2020-04-09 07:06:06

ఈ రోజుల్లో పెళ్లయిన ఆరు నెలలకే ఒక సాధారణ క్వశ్చన్ బయటికి వస్తుంది. శుభవార్త ఎప్పుడు చెబుతున్నారు అంటూ కొత్త దంపతులను వెంటాడే ప్రశ్న ఇది. అలాంటిది సమంత రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. దాంతో ఎప్పుడు బయటికి వచ్చినా కూడా అక్కినేని కోడలుకి ఓకే క్వశ్చన్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. జూనియర్ అక్కినేని ఎప్పుడు వస్తున్నాడు.. నాగేశ్వరరావు మళ్ళీ ఎప్పుడు పుడుతున్నాడు అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీనికి సమంత అక్కినేని కూడా ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం చెబుతుంది. తనకు ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం అసలు లేదని.. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంచామని చెబుతోంది సమంత. తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని కంటామంటూ ఆసక్తికరమైన సమాధానం చెబుతుంది అక్కినేని కోడలు. ఈ విషయంలో తనకు ఎలాంటి తొందరలేదని.. దాంతో మిగతా వాళ్లకు కూడా అవసరం లేదు అంటూ సెటైర్లు వేస్తుంది సమంత.


ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే సమంత.. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ప్రగ్నెన్సీ రావడమే అని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. గతంలో కూడా సమంత గర్భంపై చాలా వార్తలు వచ్చాయి. తర్వాత అన్నీ అబద్ధాలే అని తెలిసాయి. ఈ విషయాన్ని సమంత కూడా సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ ను భర్తతో ఎంజాయ్ చేస్తుంది స్యామ్. ఇందులో భాగంగానే ఈ ప్రెగ్నెన్సీ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఏదైనా సమంత చెబుతున్న సమాధానం మాత్రం ఆసక్తికరంగా ఉంది. తమకు పిల్లలు కావలసినప్పుడు కంటామని.. ఇప్పట్లో తొందర లేదని చెప్పడం అక్కినేని అభిమానులను కలవరపెడుతోంది. అసలు ఈమెకు నిజంగానే సంతానంపై ఆసక్తి ఉందా లేదా అని అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం ఎప్పుడూ తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని.. తల్లి కావడం కూడా ఒక వరం చెబుతుంటుంది. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో సమంత తల్లి కావడం కష్టమే.. కానీ భవిష్యత్తులో మాత్రం అవకాశం ఉందని అర్థమవుతోంది.

More Related Stories