English   

అకిరా నందన్ బర్త్ డే పట్టించుకోని అల్లు బ్రదర్స్..

sirish
2020-04-09 07:40:50

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ పుట్టిన రోజు ఎప్రిల్ 8న జరిగింది. అదే రోజు అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని కూడా బర్త్ డే జరుపుకున్నారు. దాంతో సోషల్ మీడియా అంతా ఈ ముగ్గురి గురించే కనిపించింది. కరోనా వైరస్ ను కూడా ఈ ముగ్గురు డామినేట్ చేసి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, అకిరా నందన్ అయితే పోటీ పడ్డారు కూడా. ఇదిలా ఉంటే ఈ మెగా వారసులకు అందరూ విషెస్ తెలిపారు. అల్లు అర్జున్, అకిరా నందన్ కు పేరు పేరునా చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా బర్త్ డే విషెస్ మరిచిపోకుండా తెలిపారు. అలాగే అకిరా నందన్ కు కూడా మెగా హీరోలతో పాటు బయటి వాళ్లు కూడా చెప్పారు. కానీ అల్లు బ్రదర్స్ ఇద్దరూ పవన్ తనయుడికి ఎందుకో కానీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. చిరంజీవి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ ఇలా ప్రతీ ఒక్కరు అకిరాకు బర్త్ డేను సెలబ్రేట్ చేసారు.. ఆశీర్వదించారు. కానీ ఎందుకో మరి బన్నీ, శిరీష్ ఇద్దరూ అకిరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అయితే సోషల్ మీడియాలో చెప్పలేదు. దాంతో ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. ఎందుకు పవన్ కళ్యాణ్ తనయుడికి బన్నీ, శిరీష్ బర్త్ డే విషెస్ చెప్పలేదు.. మరిచిపోయారా.. ఒకవేళ మరిచిపోతే ఇద్దరూ ఒకేసారి ఎలా మరిచిపోతారు అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. మరి దీనికి సమాధానం ఏమని వస్తుందో చూడాలిక.

More Related Stories