పుష్ప అనే టైటిల్ బన్నీ నవంబర్ లోనే హింట్ ఇచ్చాడా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా పేరు పుష్ప అని రివీల్ చేస్తూ అల్లు అర్జున్ మాస్ లుక్ తో ప్రేక్షకులకు విందు ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో అయితే పెద్దగా ఆసక్తి లేదు. కానీ నిన్న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. చిత్ర టైటిల్‌తో పాటు బన్ని ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించి ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ ఇవ్వడంతో వాళ్ళు హ్యాపీ.
అయితే బన్నీ పుట్టిన రోజులు ఒక రోజు ముందే ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా లీక్ ఒచ్చేసింది. అయితే ఈ లీక్‌పై చిత్రయూనిట్ చాలా సీరియస్‌గా ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాకి మొదటి నుంచి ‘శేషాచలం’ అనే పేరు వినబడింది. కానీ ఈ సినిమాలో బన్నీ పాత్ర పేరు ‘పుష్పక్ నారాయణ’ అని అందు నుంచే ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంచితే ఈ టైటిల్ ని ఎప్పుడ్ప్ నవంబర్ లోనే బన్నీ హింట్ ఇచ్చినట్టు తేలింది. అప్పట్లో బన్నీ తన ఇన్‌స్టా లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గ మారింది. ఆర్య 2 సమయంలో సుక్కూ తను కలిసి ఉన్న పిక్, ఈ మధ్య తామిద్దరం కలిసి ఉన్న పిక్ పెట్టిన బన్నీ తామిద్దరి శరీరాల్లో మార్పులు ఒచ్చాయేమో కానీ తమ ప్రేమలో కాదని రాసుకొచ్చాడు. చివరిలో ఎవరికీ అర్ధం కానట్టు పుష్ప అని english లో రాశాడు. దానిని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అభిమానులు.