మనవడి కోసం మెగాఫోన్ పట్టుకున్న సూపర్ స్టార్ కృష్ణ

మహేష్ బాబు మేనల్లుడు, టిడీపీ ఎంపి గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా కూడా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ కి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించారు అనే వార్త సంచలనంగా మారింది.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు కృష్ణ సెట్స్ కి వెళ్ళారట. అక్కడ కృష్ణని చూసి డైరెక్టర్..ఒక సన్నివేశాన్ని డైరెక్ట్ చేయమని అడగడంతో కృష్ణ కూడా ఒప్పుకొని చేశారట. అది సినిమాకే కీలకమైన సీన్ అని సమాచారం. మరి కృష్ణ దర్శకత్వంలో ఆ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక గతంలో సూపర్ స్టార్ సింహాసనం, బాల చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్లకు మనవడి కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు. ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు.