English   

పరశురామ్ పై మండిపడ్డ నాగార్జున

 Nagarjuna
2020-04-09 12:07:31

గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు పరశురామ్ ఆ తర్వాత మాత్రం సినిమాలే లేకుండా అయి పోయాడు. ఎట్టకేలకి మనోడికి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రెండు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. అది మనోడికి కొత్త చిక్కులు పట్టుకొచ్చాయి. పరశురామ్‌ నాగచైతన్యతో సినిమా చేస్తున్నట్టు ప్రకటన కూడా చేశారు. అయితే అప్పుడే మహేష్ నుండి పిలుపు వచ్చింది. దీంతో చైతూ సినిమా పూర్తి అయ్యాక మహేష్ తో సినిమా చేయనున్నాడని అన్నారు. కానీ ప్రచారం మాత్రం నాగచైతన్య సినిమా ఆగిపోయిందని జరుగుతోంది. నిజానికి గీత గోవిందం సినిమా తరువాత చాలా ఖాళీగా ఉన్న పరుశురామ్ ఓ సినిమాను 14రీల్స్ కు కమిట్ అయి అడ్వాన్స్ తీసుకున్నాడు. అదే చైతూతో సినిమా. ఇప్పుడేమో మహేష్ తనతో సినిమా చేయమంటున్నాడట. దీంతో ఇక్కడే అసలు రచ్చ మొదలయింది. 

మా దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తరువాత వేరే వాళ్ళకి ఎలా సినిమా చేస్తారు ? అంటూ పరశురామ్ ని హోల్డ్ లో పెట్టిందట మైత్రీ. అయితే ఒక సినిమా ప్రకటించాక కూడా మరో హీరోకి కధ చెబితే చెప్పావు కానీ ఆ సినిమా కూడా ఇప్పుడే చేస్తానని ఎలా మాట ఇచ్చావని నాగర్జున పరశురామ్ మీద సీరియస్ అయినట్టు చెబుతున్నారు. మరో పక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ సినిమా షూటింగ్  జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కావాల్సి ఉన్నా అది ఇంకా షూట్ కూడా పూర్తి చేసుకొని పరిస్థితి. మరి నాగార్జునకి పరశురామ్ ఏమని చెప్పుకుంటాడో చూడాలి. 

More Related Stories