లాక్ డౌన్ నేపధ్యంలో అనిల్ రావిపూడి సినిమా...దానికి సీక్వెల్

తెలుగులో అసలు ఫ్లాప్ లే లేని డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒక్కరు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు ఐదూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ , రవితేజ లతో ఎఫ్ 2 సిక్వెల్ ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. అది కాక మహేష్ కబురు పెడితే ఆయన దగ్గరకు వెళ్లి ఇప్పుడేమి ఆయనతో సినిమా చేయలేనని చెప్పి వచ్చాడని కూడా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఎఫ్ 3 గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సీక్వెల్ కోసం ఆయన లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ను ఎంచుకున్నట్టుగా ఆయన టీమ్ నుండి సమాచారం అందుతోంది. ఇప్పుడు కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ కారణంగా భార్యాభర్తలు ఇంట్లో ఎక్కువ సమయం గడపుతున్న సంగతి తెలిసిందే. ఇక వారిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలను తనదైన శైలిలో చూపించడానికి అనిల్ రెడీ అవుతున్నాడని అంటున్నారు. చూడాలి ఇందులో ఎంతవరకూ నిజం ఉందొ. ఈ కాన్సెప్ట్ కి పెద్దగా బడ్జెట్ కూడా అక్కర్లేదని అంటున్నారు.