English   

పోలీసులకు సెల్యూట్ చేసిన మహేష్ బాబు.. 

Mahesh
2020-04-09 12:53:40

కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు కానీ వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పోలీసులు కూడా రోడ్లపైనే ఉన్నారు. వాళ్ల కుటుంబాలను వదిలేసి రోజుల తరవడి దేశం కోసం సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించుకోవాల్సిన బాధ్యత.. వాళ్లకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మహేష్ బాబు ఇదే చేసాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం.. మన కుటుంబాల సంక్షేమం కోసం వాళ్ల కుటుంబాలను వదిలేసి పనిచేస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు ఈయన. కోవిడ్‌-19పై మన దేశం చేస్తున్న యుద్ధంలో అహర్నిశలు కష్టపడుతోన్న తెలంగాణ పోలీసు యంత్రాంగానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేసాడు సూపర్ స్టార్. 

మన క్షేమం కోసం అహర్నిషలు పని చేస్తున్న వాళ్ల సేవలు అసాధారణమైనవి అని కొనియాడాడు మహేష్. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రాణాలతోపాటు, మన కుటుంబసభ్యుల జీవితాలను కాపాడుతున్నందుకు వారికి తన కృతజ్ఞతలు తెలిపాడు ఈయన. మనదేశం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ నిస్వార్థమైన అంకితభావానికి సెల్యూట్‌ చేస్తున్నానంటూ మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే రీల్ లైఫ్ లో పోకిరి, దూకుడు, ఆగడు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలో దేశానికి సేవ చేసే పోలీసు, సైనికుడి పాత్రలు చేసాడు మహేష్ బాబు. 

More Related Stories