English   

నాకు మా అన్నయ్యే ఆంజనేయుడు.. పవన్ ట్వీట్..

 Pawan Kalyan
2020-04-09 20:01:47

ఎప్రిల్ 8 తనకు చాలా కీలకం అని.. ఆ రోజు తన జీవితంలో ఓ అద్భుతం జరిగిందని చెప్పాడు చిరంజీవి. సరిగ్గా 58 ఏళ్ల కింద.. అంటే 1962లో ఓ లాటరీలో తనకు హనుమంతుడి బొమ్మ వచ్చిందని చెప్పాడు చిరు. అది ఇంటికి తీసుకొచ్చి చూపిస్తే అది చూసిన తన నాన్న వెంకట్రావు చాలా సంతోషించాడని.. అంతేకాదు నీ కనుబొమ్మలు, కన్ను, ముక్కు అన్నీ అచ్చం అలాగే ఉన్నాయి అంటూ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ హనుమాన్ బొమ్మ తన దగ్గరే ఉందని చెప్పాడు చిరు. 

హనుమాన్ జయంతి కానుకగా తన జీవితంలో జరిగిన ఈ గుర్తును అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్. ఇప్పుడు ఈ ఫోటోకు పవన్ నుంచి కూడా స్పందన వచ్చింది. ఆ హనుమాన్ రూపమే తమ అన్నయ్య చిరంజీవి రూపంలో ఇంటికి వచ్చిందని.. ఆ తర్వాత ఆ భక్తి నాన్న నుంచి తనకు కూడా వచ్చిందని చెప్పాడు. తాను టీనేజ్ లో ఉన్నపుడు హనుమాన్ ఛాలీసాను 108 సార్లు చదివేవాడినని గుర్తు చేసుకున్నాడు పవర్ స్టార్. మొత్తానికి అన్నాదమ్ముళ్ల అనుబంధం చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. 

More Related Stories