English   

ఆడపడుచు మరణం తర్వాత సుమ ఏం చేసిందంటే..

suma
2020-04-09 19:55:28

ఎందుకో తెలియదు కానీ మూడేళ్లుగా రాజీవ్ కనకాల కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. ఈయన తల్లి మూడేళ్ల కింద అనారోగ్యంతో మరణించారు. గతేడాది ఆయన తండ్రి దేవదాస్ కనకాల కూడా అనారోగ్యంతో చనిపోయారు. ఇక మూడు రోజుల కింద రాజీవ్ సొంత అక్కడ శ్రీలక్ష్మి కనకాల కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. రెండేళ్లుగా కేన్సర్ తో బాధ పడుతున్న ఈమె శ్రీలక్ష్మి ఎప్రిల్ 6న చనిపోయారు. సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావును అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె. రెండు వేర్వేరు కులాలు అయినా కూడా ఇద్దరికీ పెద్దలు పెళ్ళి చేసారు. తాను డైరెక్ట్ చేసిన, నిర్మించిన సీరియల్స్ లో నటిగా కూడా దేవదాస్ కనకాల ప్రోత్సహించారు కూడా. వెండితెరపై కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు ఆడపడుచు మరణంతో సుమకు కొత్త బాధ్యతలు వచ్చాయి. ఇప్పటికే ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇప్పుడు ఆడపడుచుకు కూడా బాబు, పాప ఉన్నారు. పాప ఇంటర్.. బాబు టెన్త్ చదువుతున్నారు. ఈ సమయంలో తల్లి చనిపోవడం వాళ్లకు తీరని లోటు. దాంతో అత్త అయినా కూడా ఇప్పుడు అమ్మ బాధ్యతలు తీసుకుంటుందని తెలుస్తుంది. రాజీవ్ కనకాలతో పాటు బంధువులు కూడా ఇదే చెప్పడంతో సుమ వాళ్ల ఆలనా పాలన చూసుకోడానికి ముందుకు వచ్చిందని తెలుస్తుంది. రాజీవ్ కూడా ఇప్పట్నుంచి అల్లుడు, కోడలు బాధ్యతలు తీసుకోబోతున్నాడు.

More Related Stories