టాలీవుడ్ నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం...

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ తెలిసే ఉంటాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న ఈయన ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు. ఇప్పుడు ఈయనకు అనుకోని ప్రమాదం జరిగింది. ఇంట్లోనే ఉన్నపుడు అనుకోకుండా కిందపడ్డారు నర్సింగ్ యాదవ్. దాంతో ఆయన తలకు బలమైన గాయమైంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న ఈయన.. ఎప్రిల్ 9 సాయంత్రం 4 గంటల సమయంలో కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్నాడు నర్సింగ్ యాదవ్.
ప్రస్తుతం ఈయన పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రక్తం ఎక్కువగా పోవడంతో కండీషన్ విషమంగా ఉందంటున్నారు వాళ్లు. ఈయన వయసు 56 సంవత్సరాలు. వర్మ తెరకెక్కించిన క్షణ క్షణం, గాయం లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నర్సింగ్. రాజేంద్రుడు గజేంద్రుడులో కూడా మంచి పాత్ర చేసాడు. హిందీ, తెలుగు, తమిళం అన్నీ కలిపి దాదాపు 125 సినిమాలకు పైగానే నటించాడు నర్సింగ్ యాదవ్.