English   

లారెన్స్ ను చూసి బుద్ధి తెచ్చుకొండి.. స్టార్ హీరోలకు కొత్త చిక్కులు..

raghava
2020-04-10 07:26:51

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కరోనా బాధితుల కోసం ఏకంగా 3 కోట్లు విరాళం అందించాడు. దాంతో ఈయన పేరు ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఒక సినిమా కోసం తీసుకున్న సన్ పిక్చర్స్ దగ్గర తీసుకున్న మూడు కోట్ల అడ్వాన్స్ మొత్తం విరాళం అందించేసాడు లారెన్స్. అందులో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు.. ప్ర‌ధాన‌మంత్రి స‌హాయ‌నిధికి 50 ల‌క్ష‌లు.. డాన్సర్స్ అసోషియేషన్‌కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 ల‌క్ష‌లు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. దాంతో ఇప్పుడు స్టార్ హీరోలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో విరాళం విషయంలో ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలు ముష్టి పడేసినట్లు కేవలం 10 లక్షలు, ఇరవై లక్షలు విరాళంగా ఇచ్చారు. రజనీకాంత్ 50 లక్షలు.. అజిత్ కోటి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇక మిగిలిన వాళ్ళంతా 20 లక్షల లోపు విరాళం ఇవ్వడంతో ఇప్పుడు లారెన్స్ ని చూపించి నెటిజన్లు బండ బూతులు తిడుతున్నారు. ఒక్కో సినిమాకు 20 కోట్లు.. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే మీరు 20 లక్షలు, 30 లక్షలు ఇస్తారా.. కనీసం అక్కడ లారెన్స్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి.. సిగ్గు తెచ్చుకోండి అంటూ హీరోలతో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇదే విషయంపై తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు సెల్వమణి కూడా ఫైర్ అయ్యాడు. నటీనటులకు కనీస బాధ్యత లేకుండా పోతుంది.. సినిమా కార్మికుల కోసం కనీసం ముందుకు రావాలి కదా.. మానవత్వం లేకుండా ఉన్నారు అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. ఇప్పుడు లారెన్స్ ఏకంగా మూడు కోట్ల విరాళం అందించడంతో స్టార్ హీరోలు ముందుకు వస్తారో లేదో చూడాలి.

More Related Stories