English   

లాక్‌డౌన్‌లోనూ నిధి అందాల విందు

nidhi
2020-04-10 07:58:31

సవ్యసాచి చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది నిధి అగర్వాల్. తన అందచందాలతో యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేసిన నిధి సవ్యసాచి అయిన వెంటనే మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకున్నా కానీ హిట్ మాత్రం దక్కలేదు. అయితే పూరీ జగన్నాథ్ ఈ హాట్ బ్యూటీ గ్లామర్ ని ఇస్మార్ట్ శంకర్ లో మరింతగా ఎలివేట్ చేశాడు. అదీ కాక ఆ సినిమాతో ఈ భామకి మొదటి హిట్ కూడా దక్కింది. అయితే ఎద అందాలను ఆరబోయడంలో నిధి ఎక్స్ పర్ట్ అని చెప్పచ్చు. ఇక ప్రస్తుతం ప్రపంచం అంతా లాక్ డౌన్ పేరిట ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక అలవాటు పడిన ప్రాణం ఫోటో షూట్ లు లేకుండ ఉండగలదా ? అందుకే ఈమె మేకప్‌ లేకుండానే ఫోటోలకు పోజులిస్తూ హల్‌చల్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అక్కడితో ఆగక ‘‘వెబ్‌ కామ్‌ సీరీస్‌ ముందు ఫోటో షూట్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. కెమెరా నా ముందున్న ఇది సరైన ప్రదేశం కాదనిపిస్తోంది’’ అంటూ ఒక కామెంట్ కూడా రాసింది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ తెలుగులో అశోక్‌ గల్లాతో ఓ సినిమా, రవితేజతో కలిసి రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న మరో సినిమాలో ఓకే అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నిధి అందాల మీద ఒక లుక్కేయండి.

 

More Related Stories