సాయితేజ్ ఇక పై అవి చేయడట

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చాలా వేగంగా పికప్ అయ్యాడు మెగా మేనల్లుడు. పెద్దగా అంచనాలు కూడా లేకుండా ఎంట్రీ ఇచ్చి ఈరోజు సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. మామయ్యల్ని ఫాలో అవ్వడం.. వాళ్ల పాటలను తన సినిమాల్లో వాడేసుకోవడంలో సాయిని ఇప్పటిదాకా కొట్టేవాళ్లే లేరు. ఎందుకంటే చరణ్ కూడా తన తండ్రి పాటలు వాడకం పెద్దగా చేయలేదేమో కానీ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లోనూ మేనమామల్ని బాగానే వాడేడు తేజూ. రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్,ఇంటెలిజెంట్ లాంటి సినిమాల్లో చిరంజీవి రీమిక్స్ సాంగ్స్ వాడేసాడు సాయి. అయితే ఇలా పాటల వాడకం విషయంలో కొందరు విమర్శించగా, మరికొందరేమో సమర్థించారు. అయితే తాజాగా ఈ రీమిక్స్ పాటలపై సాయి ధరమ్‌తేజ్ సంచలన కామెంట్స్ చేశాడు.
అదేంటంటే ఇకపై తాను నటించబోయో సినిమాల్లో రీమిక్స్ పాటలు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. దర్శకనిర్మాతలు చెప్పినా, ఈ విషయంలో ముందుకెళ్లే అవకాశం కూడా ఉండదని చెప్పేశాడు. అయితే ఎందుకయ్యా ఈ నిర్ణయం అంటే..ఒక్కోసారి రీమిక్స్ పాటలు బాగా కుదురుతాయి...మరోసారి పాతవాటిని చెడకొట్టామని పేరు రావచ్చని అందుకే ఇక వాటిని ముట్టుకోవద్దని ఫిక్స్ అయ్యానని చెప్పికొచ్చాడు. ఇక తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చేస్తున్నాడు. ఇది రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక వైపు దేవ కట్టా దర్శకత్వంలో ఒక సినిమా షూట్ కి వెళ్ళాల్సి ఉంది.