త్రిష గాలి తీసేసిన చిరంజీవి...ఏది నిజం

చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో రానున్న ‘ఆచార్య’ హీరోయిన్ విషయంలో అనూహ్య మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రంలో చిరుకు జోడీగా త్రిషను ఎంపిక చేసుకోగా.. తర్వాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకుంది. ఆ ప్లేస్‌ను కాజల్‌తో భర్తీ చేశారు మేకర్స్. కథ సుఖాంతం అయిందనుకుంటే ఈ కథ వెనుకున్న మరో కథ వెలుగులోకి వచ్చింది. త్రిష చెప్పిన కారణం ఒకలా ఉంటే చిరంజీవి చెప్పింది మరోలా వుంది. తనకు మొదట చెప్పిన స్క్రిప్ట్‌కు తర్వాత షూట్ కి వెళ్ళాక చూసిన దానికి తేడా ఉందని, ఈ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ఆ సమయంలో ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది త్రిష.
అయితే ఆచార్య నుంచి తప్పుకోవడానికి త్రిష చెప్పిన కారణంతో చిరంజీవి ఏకీభవించడం లేదు. త్రిష ‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం పట్ల చిరంజీవి ఓ ఆంగ్లమీడియాకు క్లారిటీ ఇచ్చారు. చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరితోనూ త్రిషకు క్రియేటివ్ డిఫరెన్స్ లేదన్నాడు. తను అందరితో మాట్లాడానని ఎవరూ ఆమెతో గొడవ లేదన్నారని చెప్పారు. అయితే మణిరత్నం సినిమాలో ఛాన్స్ రావడంతో ఆచార్య నుండి తప్పుకున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నాడు. అంతేకాదు అప్పటికే త్రిష కోసం చిరు తనయ సుస్మిత కాస్ట్యూమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి త్రిష చెప్పింది? నిజమా లేక చిరు చెప్పింది నిజమా అన్న విషయం మీద క్లారిటీ రావల్సి ఉంది.