మునుపెన్నడూ చేయని ప్రయోగం చేస్తున్న బాలయ్య

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్లగా కరోనా దెబ్బకు అది వాయిదా పడింది. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని అంటున్నారు. అందులో ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరొకటి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ అని అంటున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ హీరోయిన్స్ ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు జర్గుతుండగా శ్రియ లాంటి వాళ్ళ పేర్లు ప్రచారంలోకి వచ్చింది.
ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం శ్రియ ఓకే అయినట్టు కూడా అన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇందులో అఘోర పాత్రలో బాలయ్య ఒక్క మాట కూడా మాట్లాడడం కానీ ఏదయినా యాక్షన్ సన్నివేశాలలో నటించడం కానీ చేయదడ. అంటే ఇజా రకంగా కళ్ళతోనే నటించే పాత్రన్న మాట. అయితే పంచ్ డైలాగ్స్‌కి, మాస్ ఫైట్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన బాలయ్యతో అలాంటి పాత్ర చేయించడం అంటే సాహసం అనే చెప్పాలి. చూద్దాం ఈ ప్రయోగం ఏమేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో ?