అనుపమ ఫేస్ బుక్ హ్యాక్...పేజ్ కూడా లేపేశారు

సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్ అవడం అనే కొత్త విషయమేమీ కాదు. గతంలో ఒకసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటుడు షాహిద్ కపూర్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అమితాబ్ ట్విటర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఏకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫొటోని డీపీగా పెట్టి రచ్చ చేశారు. ఇక ప్రేమమ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇక్కడే సెటిల్ అయిన మలయాళ బ్యూటీ అనుపమ ఫేస్బుక్ పేజీని దుండగులు హ్యాక్ చేశారట. దీంతో ఆ పేజీలో పోస్ట్ అయ్యే ఏ విషయన్నీ తాను కన్ఫర్మ్ చేసేదాకా పట్టించుకోవద్దని ఆమె వెల్లడించింది. అయితే ఈ విషయం పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఆమె ఫేస్ బుక్ పేజ్ ఎగిరిపోయింది. ఏమయిందో ఏమో కానీ ఆమె పేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే అనుపమ హీరోయిన్ గా ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాని పీవీపీ బ్యానర్ మీద పీవీపీ నిర్మించనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. మరో పక్క ఆమె కార్తికేయ 2 సినిమాలో కూడా నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందొ వేచి చూడాలి.