English   

పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా... చిరంజీవి 

 Chiranjeevi
2020-04-10 12:13:44

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో దాదాపు అందరికీ రెస్ట్ లభించింది. కొన్ని అత్యవసర సర్వీసుల వారు మాత్రం పని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పోలీసుల గురించే. వారు ఇళ్ళకి సైతం దూరం అయి డ్యూటీలు చేస్తున్నారు. వీరి మీద ముందు కొంత నెగటివ్ కామెంట్స్ వచ్చినా వారి మీద ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వారి మీద ప్రసంశల జల్లు కురిపించగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పనితీరుపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం వారు చాలా కష్టపడుతున్నారని చెబుతూ ఆయన ఒక వీడియో తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 

కరోనాను అరికట్టేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతమని నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని చిరంజీవి అన్నారు. తాను హైదరాబాద్‌ నుంచి స్వయంగా చూస్తున్నానని వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ విజయవంతమవుతోందని చిరంజీవి తెలిపారు.  వారు ఉండబట్టే కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చిందని అన్నారు. ఈరోజు పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నానని చిరంజీవి సెల్యూట్ చేశారు.  

More Related Stories