English   

సుజీత్‌కు మెగా ఆఫర్.. చిరంజీవితో నెక్ట్స్ సినిమా..

Sujeeth
2020-04-10 12:48:00

హిట్ సినిమా తీసాడా ఫ్లాప్ సినిమా తీసాడా అనేది పక్కన పెడితే 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసి ఔరా అనిపించాడు సుజిత్. షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో ఐదేళ్ల కింద రన్ రాజా రన్ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఆ ఒక్క సినిమా అనుభవమే ఇప్పుడు ఈయన నుంచి సాహో వచ్చేలా చేసింది. దీనికి టాక్ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ఇంత చిన్న వయసులో అంత పెద్ద సినిమా చేసి జాతీయ వ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్నాడు సుజీత్. టాక్ తో పనిలేకుండా సాహో 300 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. దాంతో ఈ కుర్ర దర్శకుడు తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి భారీ సినిమా చేస్తాడా లేదంటే చిన్న సినిమాతో సరిపెట్టుకుంటాడా అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 

ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి ఇంత భారీ సినిమా ఇచ్చి ప్రభాస్ అనవసరంగా తప్పు చేశాడు అంటూ ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో.. తర్వాత సినిమా ఏమై ఉంటుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనికి సమాధానంగా సుజిత్ మరోసారి పెద్ద సినిమానే చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన తర్వాతి సినిమా రామ్ చరణ్ హీరోగా ఉంటుందని ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు చిరంజీవికి ఆ ఆఫర్ టర్న్ అయిందని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన లూసీఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. 

అందులో చిరంజీవి నటించబోతున్నాడు. అయితే ఈ సినిమాను వినాయక్, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులకు ఇవ్వాలని ముందు అనుకున్నా కూడా ఇప్పుడు సుజీత్ అయితే బాగుంటాడని చిరు భావిస్తున్నాడు. అందుకే ఈ కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా మార్చాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుజీత్ కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ప్రభాస్ తర్వాత చిరును ఈ దర్శకుడు ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడో..? 

More Related Stories