ఆర్ఆర్ఆర్ ఆలస్యం...రాజమౌళి మొహమాటానికి ప్రతిఫలం

రాజమౌళికి ఒక చెడ్డ పేరుంది అదేంటంటే ఆయన చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడని, గతంలో ఆయన మాట మీద నిలబడి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేసిన దాఖలాలు తక్కువే. అయితే సినిమా క్వాలిటీ తదితరాల విషయంలో ఎక్కడా రాజీ పడని ఆయన అలా లేట్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలిని మించేలా ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమీకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర ఉద్యమానికి ముందు ఉండనుంది. షూటింగ్ ప్రారంభమైన కొత్తలోనే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
కానీ షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఆర్ఆర్ఆర్ విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా మరింత లేట్ అవ్వచ్చని అంటున్నారు. అదేంటంటే ఆచార్య సినిమాలో రామ్చరణ్ ఓ 30 నిమిషాలపాటు అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఇందులో చిరు, చెర్రీ నెట్లో వినిపిస్తున్నట్టు తండ్రీకొడుకులుగా కాకుండా గురుశిష్యులుగా కనిపిస్తారని అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాలేదు ఈలోపే నెల రోజుల పాటు రామ్చరణ్ను ఆచార్య కోసం వదిలేయాలంటూ.. రాజమౌళిని అడిగాడట చిరంజీవి. మెగాస్టార్ మాట కాదనలేక ఆయన కూడా ఓకే చెప్పాడు. దీంతో అలియాభట్, రామ్చరణ్ కాంబినేషన్లో తీయాల్సిన సీన్స్ వాయిదాపడే అవకాశం వుందని తెలిసింది.
కరోనా ఎఫెక్ట్ వున్నా.. అంతా కుదుటపడ్డాక వెంటనే షూటింగ్ మొదలుపెట్టి... రిలీజ్ డేట్ 2021 జనవరి 8 మిస్ కాకూడదన్న పట్టుదలతో రాజమౌళి వున్నాడు. ఆచార్య అడ్డుపడడంతో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై అనుమానాలున్నాయి. నిజానికి ఆచార్య కోసం చిరంజీవి రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తే గతంలో సైరా నిర్మాతగా.. సినిమా ప్రమోషన్ కోసం.. రాజమౌళి నుంచి 15 రోజులు పర్మిషన్ తీసుకున్నాడు రామ్చరణ్. మొత్తానికి తండ్రీ కొడుకుల సొంత బిజెనెస్ చేసుకుంటున్నా రాజమౌళి కాదనలేకపోవడంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్కు బ్రేకులు పడుతూనే వున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుందో ?