English   

బాలయ్యకి లేడీ విలన్ గా అలనాటి హీరోయిన్

Balakrishna
2020-04-10 14:51:01

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోల సరసన మెరిసిన భూమికా చావ్లా, పెళ్లి అయినా పూర్తిగా సినిమాలు మానేయకుండా ఒకటీ అరా చేస్తూనే ఉంది. అయితే తెలుగులి హీరోయిన్స్ పరిధి కొంత మేరకే కాబట్టి ఇప్పుడు ఆమె అక్క పాత్రలు, వదిన పాత్రలు చేస్తూ తాను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నానని చెప్పే ప్రయ‌త్నం చేస్తోంది. ఆ మ‌ధ్య ఎంసీఏ, యూ టర్న్, లాంటి కొన్ని సినిమాలు చేసిన ఆమె మళ్ళీ బాలయ్య రూలేర్ లో నటించింది. ఆ సినిమా ఫట్ కావడంతో మళ్ళీ సైలెంట్ అయింది భూమిక. 

అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ బాలయ్య సినిమాలో నటించనుందని అంటున్నారు. అది కూడా విలన్ గా అని అంటున్నారు.   బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ఉందని అంటున్నారు. ఆ పాత్రలో భూమికను నటింపచేసే ప్రయత్నం జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తను ఓ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించబోతున్నట్టు భూమిక వెల్లడించింది. బహుశా ఆ సినిమానే ఈ సినిమా అయ్యుండచ్చని అంటున్నారు. చూద్దాం ఇందులో నిజం ఎంత ఉందో ?

More Related Stories